Allu Arjun: సంధ్య తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పీఎస్‌లో హీరో అల్లు అర్జున్ విచారణ పూర్తి అయింది. విచారణ ముగిసిన అనంతరం ఎవరితో మాట్లాడకుండానే అల్లు అర్జున్ కారులో వెళ్లిపోయారు. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, అనంతరం జరిగిన…
Allu Arjun: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటన ఘటనపై హీరో అల్లు అర్జున్ 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందుకు విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈరోజు ఏసీపీ ముందు అల్లు అర్జున్ విచారణకు హాజరుకానున్నారు. అల్లు అర్జున్‌ను దర్యాప్తు అధికారి ఏసీపీ రమేష్ కుమార్ తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీలు విచారించనున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆంక్షలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. పోలీసులు నోటీసులు అందించిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంట్లో కీలక సమావేశం జరుగుతోంది. తమ లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్ సమావేశమయ్యారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు చిక్కడపల్లి పోలీసులు. ఈ వార్త ఒక్కసారిగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. కాసేపటి క్రితం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఉన్నపళంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకువెళ్లారు. అదే విధంగా బన్నీ మొత్తం నాలుగు సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసారు. బన్నీఅరెస్ట్ చేసే సమయంలో అల్లు అరవింద్ అక్కడే ఉన్నారు. బన్నీ తో పాటు అరవింద్ కూడా…
పుష్ప -2 సినిమా ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా ఇప్పుడు సినీనటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.…