నవంబర్ 17న చత్తీస్‌గఢ్‌లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు బీజేపీ సీనియర్ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగిస్తున్నారు. ఈ రోజు(సోమవారం) విజయ్ సంకల్ప్ మహార్యాలీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రధాని మోడీ ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌కు చేరుకున్నారు. భూపేష్ బఘేల్ ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేశారు.
Amit Shah: 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పండరియా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేద గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం మతమార్పిడి చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ స్కాములను వెలికితీసి, అవినీతికి పాల్పడిన వ్యక్తుల్ని జైలుకు పంపుతామని అమిత్ షా అన్నారు.
PM Modi: ఈ నెలలో ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఒక గిరిజన వ్యక్తి దేశానికి రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ప్రధాని ఆరోపించారు.