ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మంగళవారం సిట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరు నుంచి శ్రీలంకకు పారిపోతుండగా.. చెవిరెడ్డిని విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆపై సిట్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. మంగళవారం రాత్రి చెవిరెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను విజయవాడకు తరలించారు. ఈ అరెస్టుపై చెవిరెడ్డి వైసీపీ కార్యకర్తలకు, నేతలకు వాయిస్ మెసేజ్ పంపారు. చంద్రబాబుకు భయం పుట్టేలా నేతలు, కార్యకర్తలు పార్టీ…
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన సతీమణి లక్ష్మీ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, ఏ తప్పు చేయని చెవిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, త్వరలోనే చెవిరెడ్డి బయటకు వస్తారని లక్ష్మీ పేర్కొన్నారు. సిట్ అధికారులు బెంగళూరులో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 1 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రోడ్డుపైనే…