రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎనిమిది మంది కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అందెల శ్రీరాములు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.