శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’.. దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తుంది. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ కు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని ‘చెప్పాకే.. చెప్పాకే’ పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు. సముద్రంలో ఒడ్డున జరిగిన ఈ పాట షూటింగ్ విజువల్స్ ఆకట్టుకొంటున్నాయి. యువ…