IPL 2023 : బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్న వార్నర్.. 10 ఓవర్లకు స్కోర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లకు 223/3 పరుగులు చేసింది. దీంతో భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా(5) ఔట్ అయ్యాడు. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రాయుడు క్యాచ్ అందుకోవడంతో పృథ్వీ షా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 5 పరుగుల(1.3వ ఓవర్)కే తొలి వికెట్ కోల్పోయింది. దీంతో దీపక్ చహార్ ఢిల్లీకి వరుస షాక్‌లు ఇచ్చాడు. వరుస బంతుల్లో సాల్ట్, రూసోను దీపక్ చహార్ ఔట్ చేశాడు.
Also Read : Kerala: 10వ తరగతి టాపర్‌గా సారంగ్.. చనిపోయి ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఐదో ఓవర్‌ను దీపక్ చాహర్ వేయగా నాలుగో బంతికి ఫిలిఫ్ సాల్ట్ (5) రహానే చేతికి చిక్కగా, ఐదో బంతికి రిలీ రూసో(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక.. ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. తనకు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఢిల్లీ స్కోర్ నెమ్మదిగా సాగుతుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 10 ఓవర్లకు కేవలం 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 31 బంతుల్లో 51 పరుగులు చేశాడు.
Also Read : MSDhoni: ధోని భయ్యా.. నీ క్రేజ్ కో దండం.. బాల్స్ వేసేందుకు భయపడుతున్నారు!
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు ఇద్దరు అర్థ శతకాలతో చెలరేగారు. దీంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ ( 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 79 పరుగులు ) హాఫ్ సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ డేవాన్ కాన్వే ( 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్ తో 87 పరుగులు ) అద్భుతమై బ్యాటింగ్ చేశారు. వీరికి తోడు శివమ్ దూబే ( 9 బంతుల్లో 3 సిక్సులతో 22 పరుగులు ) కూడా ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పాటు చివర్లో రవీంద్ర జడేజా ( 7 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 20 పరుగులు ) అద్భుతమైన షాట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ 200 పరుగులు మార్క్ ను ధాటింది. అయితే ఢిల్లీ బౌలరల్లో చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జే తలా ఓ వికెట్ పడగొట్టారు.

తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!