Chennai Rains Latest Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు తమిళనాడు రాజధాని చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు ధనవంతులు, ఐటీ జాబర్స్ కొందరు కుటుంబాలతో కలిసి విలాసవంతమైన హోటళ్లకు వెళుతున్నారు. చెన్నై నగరంలో గతేడాది డిసెంబరులో భారీ వర్షాలు కురవడంతో…