ముంబై నుంచి చెన్నై వెళ్తున్న చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు రైలు బోగీల్లోకి ప్రవేశించి.. ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దుండగులు పథకం ప్రకారం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే సిగ్నల్…
Indian Railways: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి నడిపించనుంది. తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-కోడంబాక్కం మధ్య ఈ రైలును నడిపించాలని రైల్వేశాఖ సన్నాహాలు నిర్వహిస్తోంది. ఈ లోకో ట్రైన్‌ను గతంలో హౌరా నుంచి ఢిల్లీ మధ్యలో అధికారులు నడిపించేవారు.…