హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ సృష్టించింది. బుధవారం రాత్రి హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. సీ.సీ కెమెరాల్లో లభించిన వీడియో ఆధారంగా వరంగల్‌లోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించినట్లు గుర్తించారు.
Cheddi Gang: తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్‌చల్ చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్, రామచంద్రాపురంలోని పలు కాలనిలో వరుస దొంగతనాలకు గ్యాంగ్ పాల్పడుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్‌చల్ చేసింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చెడ్డి గ్యాంగ్ భయాందోళనకు గురిచేశారు. బృందావన్ కాలనిలో వరుస దొంగ తనాలకు పాల్పడుతూ ప్రజలను హడలెత్తిస్తున్నారు.
విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ ఈ మధ్య కలకలం సృష్టిస్తోంది… విజయవాడ, అమరావతి, తాడేపల్లి ప్రాంతాల్లో పలు చోట్ల చోరీలకు పాల్పడింది చెడ్డీ గ్యాంగ్.. దీంతో రంగంలోకి దిగిన బెజవాడ పోలీసులు… ఈ కేసులో పురోగతి సాధించారు.. రెండు గ్యాంగ్‌లకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.. చెడ్డీ గ్యాంగ్ చోరీ ఘటనల సీసీటీవీ ఫుటేజీని గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా పంపించారు బెజవాడ పోలీసులు. తాడేపల్లి చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలోని చెడ్డీ గ్యాంగ్ సభ్యులను గుజరాత్ పోలీసులు…
జంటనగరాల ప్రజలను భయాందోళనకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు ఏపీలో దోపిడీలకు తెగబడుతున్నారు. ఏపీలోని పులివెందుల నుంచి గుండుగొలను వరకు చెడ్డీగ్యాంగ్ వరుస దోపిడీలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో దొంగతనాలు చేసిని ఈ ముఠా ఇప్పడు విజయవాడలో ప్రత్యక్షమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిట్టినగర్, గుంటుపల్లిలో చెడ్డీగ్యాంగ్ ముఠా దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇటేవలే ఈ ముఠా పులివెందుల, తిరుపతి, ప్రకాశం, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు దోపిడీలకు పాల్పడ్డ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే…
హైదరాబాదులో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. నగర శివారు ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ ఆనవాళ్లు కనిపించాయి. రాచకొండ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ముఠా మరొకసారి కనబడింది. కుషాయిగూడ పరిధిలో చెడ్డి గ్యాంగ్ రెక్కీ చేసినట్లు తెలుస్తుంది. పలు కాలనీలలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. చెడ్డి గ్యాంగ్ కదలికల పై జంటనగరాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాయి పోలీసులు. నగరంలో మరొకసారి పాగా వేసిన చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి…