దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణంతో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సంస్థలు అనేక నగరాల్లోని ప్రజలకు చౌక ధరలకు ఉల్లిపాయలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నివసించే ప్రజలకు కిలో ఉల్లిని కేవలం 25 రూపాయలకే అందించనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని తిరిగొచ్చారు. ప్రధాని పర్యటనలో భాగంగా భారత్ కు సెమీకండక్టర్, జెట్ ఇంజిన్ టెక్నాలజీ, టెస్లా లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అంతేకాకుండా అటు అమెరికా కూడా చాలా లాభపడింది. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 8 వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఇందులో శెనగలు, కాయధాన్యాలు, యాపిల్స్, వాల్‌నట్‌లు మరియు బాదం పప్పులు ఉన్నాయి.