ఒక్క క్షణమైనా ఫోన్ లేకుండా ఉండలేని రోజులు ఇవి. టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా డేటా ఛార్జీలు బాగా తగ్గాయి. అయితే ఈ మధ్యకాలంలో నిర్వహణ కష్టంగా వుందని ప్రైవేట్ టెలికాం సంస్థలు భారీగా ధరలు పెంచేశాయి. వీఐ, జియో, ఎయిర్ టెల్.. ఈ ప్రైవేట్ సంస్థలన్నీ ధరలు పెంచినా దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం బీఎస్‌ఎన్ ఎల్ మాత్రం తన ఛార్జీల్లో మార్పులు చేయలేదు. ఎయిర్ టెల్ రూ. 179 జియో రూ.155 వీఐ…
సంచలన ప్రకటనలకు వేదికగా మారింది రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో కొత్త సభ్యులు చేరారు. చమురు విభాగంలో ఈ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టిన సౌదీ అరేబియా సంస్థ ఆరామ్‌కో ఛైర్మన్ యాసిర్ అల్ రుమయాన్ రిలయన్స్ బోర్డులోకి వస్తున్నారు. రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. బోర్డులోకి ఆరామ్ కో ఛైర్మన్ యాసిర్ అల్ రుమయాన్‌ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆయన…