Charith Manas: చరిత్ మానస్.. ఈ పేరు మహేష్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు చెల్లి ప్రియదర్శిని, హీరో సుధీర్ బాబు పెద్ద కొడుకే చరిత్. బాలనటుడిగానే తండ్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. చాలా సినిమాలో కనిపించిన చరిత్ పెరుగుతూ.. పెరుగుతూ మేనమామ జిరాక్స్ లా మారిపోయాడు. అచ్చు గుద్దినట్లు మహేష్ లా ఉన్నాడు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైల్, స్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పరిగెత్తే స్టైల్ ను బట్టి.. ముఖం చూడకుండా మహేష్ బాబు అని చెప్పొచ్చు. ఇక పోకిరి లో మహేష్ యాటిట్యూడ్ చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.