Charith Manas: చరిత్ మానస్.. ఈ పేరు మహేష్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు చెల్లి ప్రియదర్శిని, హీరో సుధీర్ బాబు పెద్ద కొడుకే చరిత్. బాలనటుడిగానే తండ్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. చాలా సినిమాలో కనిపించిన చరిత్ పెరుగుతూ.. పెరుగుతూ మేనమామ జిరాక్స్ లా మారిపోయాడు. అచ్చు గుద్దినట్లు మహేష్ లా ఉన్నాడు. నిజం చెప్పాలంటే.. మహేష్ కొడుకు గౌతమ్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా తండ్రిని ఫాలో అవ్వడు అంటే అతిశయోక్తి కాదు. చరిత్ నడిచినా.. నవ్వినా మహేష్ గుర్తుకు వచ్చేస్తాడు. ఇక దీంతో సోషల్ మీడియాలో చరిత్ కు జూనియర్ మహేష్ అనే పేరు పెట్టేశారు. ఇప్పటికే చరిత్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే తాజాగా సుధీర్ బాబు కుటుంబం తిరుమలలో సందడి చేశారు. సుధీర్ బాబు, ప్రియదర్శిని.. తమ ఇద్దరుపిల్లలతో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి చెల్లించాల్సిన మొక్కులను చెల్లించి స్వామివారి ఆశీస్సులను అందుకున్నారు. ఇక ఇక్కడ సుధీర్ బాబు కన్నా ఎక్కువగా చరిత్ పైనే కెమెరాలు ఫోకస్ చేశాయి. చరిత్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని సుధీర్ బాబును అడిగేశారు. ఇక దానికి సుధీర్ సమాధానం చెప్తూ.. ” ప్రస్తుతం ఎక్కడకు వెళ్లినా చరిత్ ఎంట్రీ గురించే అడుగుతున్నారు. రెండుమూడేళ్ళలో చరిత్ మానస్ టాలీవు ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడే అన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాడు” అని చెప్పుకొచ్చాడు. దీంతో జూనియర్ మహేష్ టాలీవుడ్ ఎంట్రీకోసం ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.