Shocking : చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలు స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీశాయి. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కావడంతో, ఇది హత్య, ఆత్మహత్యనా లేక డ్రగ్స్ ఓవర్‌డోసా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకులను పోలీసులు జహంగీర్, ఇర్ఫాన్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మరణాలు సహజంగా సంభవించి ఉండకపోవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆటో లోపల కీలక ఆధారాలు…
Hit and Run: తాతలు, తండ్రులు ఆస్తులు సంపాదించారు. ఈ క్రమంలో ఒళ్లు తెలియకుండా ప్రవర్తించాడు. కన్ను మిన్నూ కానకుండా కారు నడిపించాడు. ఒకరి మృతికి కారణమయ్యాడు. ఐతే స్థానికులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో నిందితున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఎవరతడు? అసలు జరిగిందేంటి? హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు.. అతడి కార్ వేగానికి అంతులేదు.. ఎవరైనా అడ్డం వస్తే అలాగే ఢీకొడతాడు. ఇంకా చెప్పాలంటే కారుకు బ్రేక్‌లున్నా పెద్దగా వాడడు.…
Falaknuma Road Over Bridge: చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో, హైదరాబాద్‌లోని పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ ఫలక్‌నుమా రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) అందుబాటులోకి వచ్చింది. ఫలక్‌నుమా రైల్వే ట్రాక్‌పై ఇదివరకు ఉన్న పాత బ్రిడ్జి ఇరుకుగా మారడం, దానిపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరగడంతో జీహెచ్ఎంసీ (GHMC) దీనికి సమాంతరంగా కొత్తగా మరో బ్రిడ్జిని నిర్మించింది. రూ. 52 కోట్ల 3 లక్షల వ్యయంతో, 360 మీటర్ల పొడవుతో రెండు లైన్లుగా ఈ కొత్త రోడ్…
హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద నిర్మించిన చాంద్రాయణగుట్ట ఫ్లైఓవరు మంత్రి కేటీఆర్ నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. రూ.45.90 కోట్లతో 674 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్ను నిర్మించగా.. ఈ ఫ్లెఓవర్ ద్వారా చాంద్రాయణగుట్టలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. SRDP ఫలాలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజల మౌలిక అవసరాలు పూర్తి చేయడంలో బల్దియా లక్ష్యం నెరవేరే అవకాశం దగ్గరలోనే ఉంది. ఈచాంద్రాయణగుట్ట…
చాంద్రాయణగుట్ట నల్లవాగు శ్మశానవాటికలో అర్ధరాత్రి చోరీ జరిగింది. 30వేల నగదును శ్మశాన వాటిక కార్యాలయం నుంచి దొంగలు ఎత్తుకెళ్లారు. శ్మశాన వాటిక నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవలే ఓ అంత్యక్రియల కోసం శ్మశాన వాటిక నిర్వాహకులు డిపాజిట్ చేసిన 30 వేల నగదు మాయమైంది. దీంతో చంద్రయాన్ గుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గల నల్లవాగు స్మశాన…
హైదరాబాద్ ఓల్డ్ సిటీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య ఘటన కలకలం సృష్టించింది.. చాంద్రాయణగుట్ట నుంచి హీషీమాబాద్ వైపు కారులో వెళ్తున్న హమీద్ అనే వ్యక్తిని వెంబడించిని గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న హమీద్‌ను బయటకు లాగి నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో పాతబస్తీలో భయాందోళనకు నెలకొన్నాయి.. అయితే,…