Chandrababu – Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ కొణిదెల పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ గ్రాంఢ్ వెల్ కమ్ పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు తెలియపర్చుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేకంగా భేటీ అయిన ఇరువురు నేతలు.. ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపై సుధీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఎన్డీయే సమావేశానికి హాజరయ్యే అంశం పైనా చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ఇరువురు సమాలోచనలు జరిపినట్లు సమాచారం.
Read Also: YCP vs TDP: దర్శిలో ఉద్రిక్తత.. కౌంటింగ్లో అవకతవకలపై టీడీపీ, వైసీపీ ఏజెంట్ల ఆరోపణలు..
కాగా, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి జనసేన అధినేత ధ్యపవన్ కళ్యాణ్ హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ భార్యకొణిదెల అన్నా లెజినోవా, కొణిదెల అకిరా నందన్ తో కలిసి చంద్రబాబు నాయుడిని సత్కరించారు. ఇక, పవన్ కొడుకు అకిరా నందన్ చంద్రబాబు ఆశీర్వాధం తీసుకున్నారు. అకిరాకు టీడీపీ అధినేత ఆశీస్సులు అందించారు.