Boyapati Srinu Met Chandrababu : 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి భారీ ఎత్తున సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది కానీ దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడమైతే ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇంకా పూర్తిస్థాయిలో రిజల్ట్స్ వెలువడక ముందే చంద్రబాబు నాయుడుని డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసేందుకు ఉండవల్లి నివాసానికి వెళ్లారు. బోయపాటి శ్రీనుకి ముందు నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు అనే పేరు ఉంది. అందుకు తగ్గట్టుగానే గత చంద్రబాబు ప్రభుత్వంలో గోదావరి పుష్కరాల సమయంలో కొన్ని యాడ్స్ కూడా ఆయన షూట్ చేశారు.
Allu Arjun: పవన్ గెలుపు.. అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్
2019 ఎన్నికలకు ముందు టిడిపి ప్రచార బాధ్యతలన్నీ బోయపాటి శ్రీను తీసుకుని స్వయంగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్ తో పాటు పాటలు కూడా రూపొందించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి బోయపాటి శ్రీను మద్దతు ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే విషయం తెలిసిన వెంటనే ఆయన చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లి నివాసానికి వెళ్లారు. కొద్దిసేపు చంద్రబాబుతో ముచ్చటించి ఆయన బయటకు వెళ్లిపోయారు. ఇక బోయపాటి ప్రస్తుతానికి ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. బాలకృష్ణతో అఖండ ఆ తర్వాత రామ్ తో స్కంద సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు ఏ సినిమా చేస్తారనే విషయం మీద క్లారిటీ లేదు. గీత ఆర్ట్స్ తో ఒక సినిమా చేయాల్సి ఉండగా హీరో ఎవరిని ఫిక్స్ చేశారనే విషయం మీద కూడా క్లారిటీ లేదు.