ఏపీ అసెంబ్లీలో నందమూరి ఫ్యామిలీపై వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నేతలతో పాటు నందమూరి కుటుంబానికి చెందిన కల్యాణ్ రాం, జూనియర్ ఎన్టీఆర్, బాలయ్యబాబు, నందమూరి రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. మా కుటుంబాన్ని అంటే ఊరుకునేది లేదన్నారు. వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు నందమూరి రామకృష్ణ. ఈ వివాదంపై కుటుంబ సభ్యులు అంతా కలిసి మాట్లాడాడమన్నారు. దిగజారి మాట్లాడితే సహించేది లేదన్నారు. మా కుటుంబంలోని…
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో.. వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అండగా నిలవాలి. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలి. పసి పిల్లలకు పాలు, బిస్కెట్స్ అందించి ఆకలి తీర్చండి అని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ ,ఐ-టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాలకు ఆహారం, మందులు పంపిణీ జరుగుతోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో టీడీపీ శ్రేణులు సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను…
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నందమూరి ఫ్యామిలీ ఖండించడంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. అసెంబ్లీలో ఏమీ జరగకపోయినా టీడీపీ నేతలు మసిపూడి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్‌ను మోసం చేసినట్లే.. ఈనాడు నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నాడని లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. కన్నీళ్లు పెట్టుకుని చంద్రబాబు పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారని లక్ష్మీపార్వతి గుర్తుచేసుకున్నారు. Read Also: అసెంబ్లీ ఘటనపై స్పందించిన ఎన్టీఆర్…
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబు స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో సుదీర్ఘమైన పోస్టును పెట్టారు. ఏపీలో రాజకీయ భవిష్యత్‌ను తలుచుకుని బాధపడాలో లేదా భయపడాలో తెలియని దుస్థితి నెలకొందని ఆయన వాపోయారు. చంద్రబాబు తమకు ప్రత్యర్థి అయ్యి ఉండొచ్చని… కానీ చంద్రబాబు లాంటి సీనియర్ నేత కన్నీటి పర్యంతం కావడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని నాగబాబు ఆవేదన వ్యక్తం…
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కీలక కామెంట్లు చేశారు. ఆంధ్రా రాజకీయం ప్రశాంతంగా జరిగేలా జగన్ చొరవ తీసుకోవాలి. పగలు..ప్రతీకారం వరకు వెళ్ళకండి. కొడాలి నాని మాటలు మార్చుకుంటే బెటర్. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినప్పుడు నాని ఎక్కడ ఉన్నాడు. కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయమే బాబుకు జరిగిందన్నారు జగ్గారెడ్డి. టీడీపీ వాళ్ళు కూడా మీ కుటుంబాన్ని అంటే ఎలా ఉంటుంది? ఏపీతో నాక్కూడా…
శుక్రవారం నాటి అసెంబ్లీ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ నేతలతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు తప్పుపడుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కూడా స్పందించారు. రాజకీయాలు రాజకీయంగానే ఉండాలని నందమూరి సుహాసిని హితవు పలికారు. Read Also: బాబాయ్ గొడ్డలిపై చర్చిద్దాం అని ఎత్తింది చంద్రబాబు : పేర్ని నాని ‘భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు.…
టీడీపీ అధినేత చంద్రబాబు కంటతడి పెట్టిన ఎపిసోడ్ పై నారా రోహిత్ తన దైన స్టైల్ లో స్పందించారు. వైసీపీ పార్టీ చాలా దారుణంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. పశువుల కంటే హీనంగా కొందరు అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని నారా రోహిత్ వ్యక్తులు చెరిగారు. సమస్యల గురించి చర్చించాల్సిన అసెంబ్లీలో చంద్రబాబు ను, ఆయన సతీమణి భువనేశ్వరి ని దూషించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. రాజకీయాలపై అలాగే విధానాలపై విమర్శలు ఉండాలి కాని కుటుంబ…
చంద్రబాబు కంటతడి పెట్టిన ఘటన బాలయ్య కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు… మీడియా ముందుకు వచ్చిన బాలయ్య కుటుంబం… వైసీపీపై ఫైర్ అయింది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో క్యారెక్టర్ అస్సాసినేషన్ మంచిదికాదని మండిపడ్డారు బాలయ్య. గొడ్ల చావిట్లో ఉన్నామా, అసెంబ్లీలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని ఆగ్రహించారు బాలకృష్ణ. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్ని ఫైర్ అయ్యారు బాలకృష్ణ. ఇకనైనా వైసీపీ తన పద్దతిని మార్చుకోవాలన్నారు. మీరు మారక…
టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం పై ఎమ్మెల్యే బాలయ్య స్పందించారు. ఇవాళ తన నివాసం లో ప్రెస్ మీట్ నిర్వహించిన బాలయ్య బాబు.. వైసీపీ తీరుపై మండి పడ్డారు. తమ సోదరి భువ నేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడటం చాలా దారుణమని నిప్పులు చెరిగారు. అసలు ఓ మహిళపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు బాలయ్య. ఇష్యూ మీద మాట్లాడాలి… కానీ.. దానికి సంబంధం లేని బయట ఉన్న మహిళలపై మాట్లాడటం దారుణమన్నారు.…
ఏపీలో రాజకీయాల రోజురోజుకు మారుతున్నాయి. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ నేతలు వ్యక్తిగతంగా, తన భార్య భువనేశ్వరీ సైతం విమర్శించారంటూ.. ఇక ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి అడుగుపెడుతానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సభను నిష్ర్కమించారు. అయితే అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఒక్కసారిగా విలపించారు. దీంతో తమ అభిమాన నేతను కించపరిచేలా మాట్లాడారని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా…