TG Venkatesh: హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం కావడంపై ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద రచ్చే జరుగుతోంది.. అధికార వైసీపీ నేతలు ఇద్దరు నేతలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.. ప్రజలు చనిపోతే పరామర్శించింది లేదు.. కానీ, 11 మంది మృతికి కారణమైన చంద్రబాబును పవన్ పరామర్శించడం ఏంటి? అంటూ ఫైర్ అవుతున్నారు.. అయితే, చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత టీజీ వెంకటేష్..…
Minister Kakani Govardhan Reddy: చంద్రబాబు నాయుడుతో పవన్ కల్యాణ్ సమావేశంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు.. ఓవైపు విమర్శలు గుప్పిస్తూనే.. కలిసి వచ్చినా చూసుకుంటామని ప్రకటిస్తున్నారు.. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. ఎంత మంది ఏకమైనా.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్‌రెడ్డియే అని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇక, టీడీపీ, జనసేన చీఫ్‌ల భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యవసాయ…
Vidadala Rajini: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సమావేశం కావడంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందిస్తోంది.. ఇప్పటికే మంత్రులు, వైసీపీ నేతలు.. ఆ ఇద్దరు నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు సందిస్తున్నారు.. 11 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన చంద్రబాబును పవన్ కల్యాణ్ పరామర్శించడం ఏంటి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.. తాజాగా, ఈ ఎపిసోడ్లో మంత్రి విడదల రజినీ హాట్ కామెంట్లు చేశారు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు,…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సమావేశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అవసరం లేదు.. ఎందుకంటే.. ఇద్దరు కలిసే సంసారం చేస్తున్నారు.. కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ చంద్రబాబేనంటూ ఆరోపణలు గుప్పించారు.ర. తమ అపవిత్ర కలయికకు పవిత్రత తీసుకువచ్చేందుకు నిన్న సమావేశం అయ్యారని సెటైర్లు వేసిన ఆయన.. చంద్రబాబు…
Ram Gopal Varma: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన రీతిలో సెటైర్లు వేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు. కేవలం డబ్బులు కోసం పవన్ తన సొంత కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తాడని అస్సలు ఊహించలేదని వర్మ అన్నాడు. దీంతో ‘RIP కాపులు , కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు’ అంటూ సోషల్ మీడియాలో వర్మ ట్వీట్ చేశాడు. అయితే వర్మ ట్వీట్‌పై జనసేన…
Sankranti Festival: ఈ సంక్రాంతికి చిత్తూరు జిల్లా నారావారిపల్లెకి వెళ్లాలని నారా, నందమూరి కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. గత మూడేళ్ల నుంచి కరోనా కారణంగా స్వగ్రామానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీ వెళ్లడం లేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లె వెళ్లాలని చంద్రబాబు కుటుంబం డిసైడ్ అయ్యింది. తన బావ కుటుంబంతో పాటు నందమూరి బాలయ్య కుటుంబం కూడా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలను ఆస్వాదించనుంది. ఈ మేరకు బాలయ్య తన భార్య వసుంధరతో పాటు…
Minister AppalaRaju: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళంలో జరిగే సభ స్క్రిప్ట్ కోసం చంద్రబాబును పవన్ కలిశాడని ఆయన ఆరోపించారు. బీజేపీతో పొత్తులో ఉండి తన రేటు పెంచుకోవడానికే చంద్రబాబును పవన్ కలిశాడని మంత్రి అప్పలరాజు ఆరోపించారు. పవన్ తనను నమ్మిన వారిని ముంచేస్తున్నాడని.. ఆయనకు డబ్బు పిచ్చి పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కలయికలో ఆశ్చర్యం ఏం లేదన్నారు. సింగిల్‌గా పోటీ చేసే దమ్ము టీడీపీ,…
Minister Roja: టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై మంత్రి రోజా తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్‌ను పరామర్శిస్తాడని.. చంద్రబాబు 11 మందిని చంపితే పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడని మంత్రి రోజా ఆరోపించారు. అసలు పవన్ కళ్యాణ్‌కు ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా అని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి రోజా ట్విట్టర్లో చేసిన ట్వీట్…
Ambati Rambabu: చంద్రబాబు-పవన్ కళ్యాణ్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు కోసమే జనసేన పార్టీ పుట్టిందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ ఆశ్చర్యకర పరిణామం కాదన్నారు. ప్యాకేజీ తీసుకుని చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన మోస్తాడని ముఖ్యమంత్రి జగన్ మూడేళ్ళ క్రితమే చెప్పారని మంత్రి అంబటి రాంబాబు గుర్తుచేశారు. వాళ్ళిద్దరూ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి కాదు టీడీపీ పరిరక్షణ కోసం చర్చించుకున్నారని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కృషికి చంద్రబాబు…