Pothula Sunitha: నేను కూడా టీడీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. ఆ పార్టీలోనే మహిళలకు భద్రత లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pothula Sunitha: తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత.. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు, లోకేష్ కు లేదన్న ఆమె.. ఎన్టీఆర్ కుమార్తెగా నారా భువనేశ్వరి అంటే మాకు గౌరవం ఉంది.. ఆమెను కించపరిచే వ్యాఖ్యలు వైసీపీ నేతలు ఎవరూ చేయలేదన్నారు. అనని విషయాలను మా ఎమ్మెల్యేలు అన్నట్లు లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డ ఆమె.. తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనే నీచమైన ఆలోచన లోకేష్‌ది అన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపి మహిళల జీవితాలతో ఆడుకున్నది టీడీపీ నేతలు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Read Also: Koppula Eshwar: రేవంత్, ఇదీ మీ సంస్కారం.. మంత్రి ఈశ్వర్ కౌంటర్ ఎటాక్
Also Read
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
ముఖ్యమంత్రి జగన్ మహిళా పక్షపాతి.. మహిళలను రాజకీయంగా, ఆర్ధికంగా నిలబడేటట్లు పథకాలు అమలు చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అంటూ కొనియాడారు పోతుల సునీత.. మీ పార్టీ ఆఫీసులో పని చేసే మహిళను లోకేష్ పీఏ వేధింపులకు గురి చేసిన విషయం అందరికీ తెలిసిందేనంటూ విమర్శలు గుప్పించిన ఆమె.. అయినా లోకేష్ ఎందుకు పీఏపై చర్యలు తీసుకోలేదు అని నిలదీశారు. టీడీపీ పార్టీలోనే మహిళలకు భద్రత లేదు అని ఆరోపించారు. జయప్రద, దివ్యవాణి వంటి చాలా మంది మహిళలు వేధింపులకు గురి అయ్యారు.. నేను కూడా టీడీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, పవన్ కల్యాణ్ టూరిస్ట్ నాయకుడు, ప్యాకేజీ స్టార్ అని మండిపడ్డారు. అయితే, పుచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు నాయకుల ఆలోచనా విధానాన్ని ఆచరణలో చూపిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు పోతుల సునీత.
తాజావార్తలు
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?