టీడీపీ అధినేత, మజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇసుక పంపిణీలో అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్స పూర్తయింది. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా కాటరాక్ట్ ఆపరేషన్ను నిర్వహించారు. చంద్రబాబుకు 45 నిమిషాల్లో కాటరాక్ట్ ఆపరేషన్ను వైద్యులు పూర్తి చేశారు.
పురందరేశ్వరి ఒక జగత్ కిలాడీ.. బావ కళ్లులో ఆనందం కోసం లేఖలు రాస్తోంది.. పురంధేశ్వరి లాంటి నీతి మాలినా, జగత్ కిలాడి లాంటి కూతురు ఎవరికి పుట్టకూడదని కోరుకుంటున్నాను.. పురంధేశ్వరి లాంటి కూతురు పుట్టిందని ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఎడుస్తుంటారు అంటూ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది.
శ్రీశైలంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏపీ గురించి మాట్లాడేటప్పుడు ముందు హైదరాబాద్ లో నాలాల్లో పిల్లలు కొట్టుకుపోతున్నారు అది చూడండి అని సెటైర్ వేశారు.