శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక యాత్ర బహిరంగ సభలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల ఆత్మగౌరవం పెంచి, మన అకౌంట్లలో డైరెక్టుగా సంక్షేమ పథకాలు వేసిన ముఖ్యమంత్రి జగన్ అంటూ ఆమె పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక యాత్ర బహిరంగ సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలకవ్యాఖ్యలు చేశారు. దేశంలో 75 సంవత్సరాలలో రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాలు తమ పార్టీకి ఓటు వేసిన వారికే సంక్షేమం ఇచ్చారని.. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీ ఏర్పాటు చేసి ప్రజల్ని బెదిరించి కొంతమందికి మాత్రమే సంక్షేమం అందించారని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుందని కోర్టులు చెప్తున్నాయని ఎంపీ సురేష్ తెలిపారు. ఈ రాష్ట్రానికి లోకేష్ అవసరం ఏముంది?.. రాష్ట్ర సంపదను దోచుకున్నారు, అందువల్లే ప్రజలు పక్కన పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది విచారణ.. ఈ రోజు మరోసారి విచారణకు రానుంది చంద్రబాబు పిటిషన్
హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని ఆయన తెలిపారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పోసాని కృష్ణ మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ కలలు కంటోందని.. తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఇక్కడ జగన్ గెలుస్తాడు అని చెప్పరు ఓడితే మాత్రం అది జరుగుతుంది అంటున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటని పోసాని ప్రశ్నించారు.
మిచౌంగ్ తుఫాన్ కొన్ని జిల్లాలను అతలాకుతలం చేసిందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తుఫాన్ వస్తుందనే సమాచారంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని.. దీని వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగిందని మంత్రి తెలిపారు. ఈ సంక్షోభం నుంచి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారని.. జగన్పై బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో టీడీపీ పూసుకుని, రాసుకుని ప్రచారం చేయటం వల్లే కాంగ్రెస్ ఓడిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ప్రచారం చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడారు.. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు.
తుఫాన్ కారణంగా రైతులంతా నష్టపోయారని.. ఎక్కడ చూసినా హృదయ విదారకంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు.