ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు శపథం చేసి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ప్రెస్‌మీట్‌లో కంటతడి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. రెండున్నరేళ్లుగా అన్ని విధాలా అవమానిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. నేను ప్రజల కోసమే పోరాటం చేశా. ఓడిపోయినపుడు కుంగిపోలేదు…గెలిచినపుడు రెచ్చిపోలేదు. ప్రతిపక్ష నేతలను నేనెప్పుడూ అగౌరవపరచలేదన్నారు చంద్రబాబు. తాను సీఎంగానే మళ్ళీ అడుగుపెడతానని శపథం చేశారు చంద్రబాబు. మరి ఏపీ రాజకీయాలు భవిష్యత్తులో ఎలా మారతాయో చూడాలి. ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైంది మొదలు టీడీపీతో…