CM Chandrababu: గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డాక్టర్ కనూరి- జింఖానా తల్లి మరియు శిశు ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మంచి కార్యక్రమానికి సహకరించిన జింఖానా సభ్యులు, ఎన్నారైలకు ధన్యవాదాలు.. సమాజంలో మంచి మిగిలి ఉందనడానికి మీరు ఉదాహరణ.. జింఖానా సభ్యులందరిని అభినందిస్తున్నా.. మనం బాగుంటేనే చాలదు... చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి.