నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన మూడవ చిత్రం “అఖండ”. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఖండ ఖండాలలో ‘అఖండ’మైన విజయం లభించింది. 2021లో ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘అఖండ’ రికార్డు క్రియేట్ చేసింది. ఇక డిసెంబర్ 2న థియేటర్లలో మొత్తం ‘జై బాలయ్య’ నామజపమే విన్పించింది. సోషల్ మీడియాలో, థియేటర్ల వద్ద భారీ కటౌట్లు పెట్టి ఆయన అభిమానులు చేసిన సందడి మాములుగా లేదు. ఇక సినిమాపై విమర్శకులతో పాటు ప్రేక్షకులు కూడా పాజిటివ్ గా స్పందించగా మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు సైతం ప్రశంసలు కురిపించారు. ‘అఖండ’ టీంకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం విశేషం. ఇది టాలీవుడ్ కు పండగ అంటూ ‘అఖండ’ను ఆకాశానికెత్తేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెషల్ ట్వీట్ చేశారు.
Read Also : ఖండ ఖండాలలో ‘అఖండ’ జాతర… ‘లవ్ స్టోరీ’ రికార్డు బ్రేక్
“అఖండ విజయం సాధించిన “అఖండ” సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ సభ్యులకు, అభిమానులకు అభినందనలు” అంటూ చంద్రబాబు చిత్రబృందాన్ని అభినందించారు. ఇక సినిమా విజయవంతం కావడంతో బాలయ్య, డైరెక్టర్ బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తో పాటు చిత్రబృందం చాలా సంతోషంగా ఉంది.
అఖండ విజయం సాధించిన “అఖండ” సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ సభ్యులకు, అభిమానులకు అభినందనలు.#Akhanda
— N Chandrababu Naidu (@ncbn) December 2, 2021