Green Hydrogen Valley: నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్, నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు సమక్షంలో గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ విడుదల అయ్యింది. ఇందులో భాగంగా 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ విడుదల చేశారు. ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్‌పై రెండు రోజుల పాటు సమ్మిట్ జరిగిన విషయం తెలిసిందే. అమరావతిలో జరిగిన ఈ సమ్మిట్‌లో 600 మంది ప్రతినిధులు, ఇండస్ట్రీ…
Botsa Satyanarayana: పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు అని ఆరోపించారు.
KTR : ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ముసుగు వీడింది. నేటితే అసలు గుట్టు బయట పడింది. తెలంగాణ నిధులను రాహుల్ గాంధీకి, నీళ్లను చంద్రబాబు నాయుడికి ఇవ్వడానికి రేవంత్ రెడీ అయ్యారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఈ రోజు జరిగిన మీటింగ్ లో అసలు బనకచర్ల ప్రస్తావన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు ఏపీ మొదటి ప్రతిపాదనే…
CM Revanth Reddy : ఢిల్లీ వేదికగా నేడు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు కీలక విషయాలపై చర్చించారు. ఆ విషయాలను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసలు ఏపీ గోదావరి-బనకచర్ల విషయాన్ని మీటింగ్ లో పెట్టలేదు. బనకచర్ల కడుతామని ఏపీ మీటింగ్ లో చెప్పలేదు. అలాంటప్పుడు అది కట్టొద్దని మేం మీటింగ్…
Telangana : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మీటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ మీటింగ్ లో ఏపీ పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించింది. తెలంగాణ మాత్రం పది అంశాలను ప్రతిపాదించింది. ఇందులో చూసుకుంటే 1.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలి. 2. శ్రీశైలం నుంచి వేరే బేసిన్ కి నీటి తరలింపు…
Ap- Telangana : ఢిల్లీలో తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ స్టార్ట్ అయింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్ తో పాటు తెలంగాణ ప్రతిపాదించిన పది అంశాలపై కూడా చర్చ జరగబోతోంది. ఈ మీటింగ్ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకరికి ఒకరు బొకేలు ఇచ్చుకుని శాలువాలు కప్పుకున్నారు. ఈ సమావేశంలో సీఎంలతో…
నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర జల శక్తి కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సమావేశ ఎజెండాలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశం పక్కన పెట్టాలని…
చిత్తూరు జిల్లా పుంగనూరులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మోసం చేయడం చంద్రబాబు నైజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వచ్చిన ప్రజలను మోసం చేయడమే ఆయన నైజమని.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలో వచ్చిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారన్నారు.
Chandrababu : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట మృతదేహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కోట శ్రీనివాస్ మరణం చాలా బాధాకరం. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఇండస్ట్రీకి నటన అంటే ఏంటో చూపించారు. 40 సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు కోట శ్రీనివాస్. నేను సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన…
BRS: తెలంగాణ రాష్ట్ర హక్కులు, పరిరక్షణ, గుర్తింపుల కోసం బీఆర్ఎస్ నేతలు లేఖల పర్వం కొనసాగుతోంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై నిరసనగా, వారు మళ్లీ గళమెత్తారు. ఇటీవల పార్టీ కార్యనాయకులు రెండు కీలక లేఖలు రాశారు.. ఒక్కటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మరొకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడికి రాసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను…