CM Chandrababu Davos Visit: ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా.. ఇప్పటికే పలు మార్లు విదేశీ పర్యటనలకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేపు దావోస్ పర్యటనకు బయల్దేరనున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం)లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలి రెండు రోజుల…