ఈ నెల 8న పామర్రులో వైసీపీ సమావేశం జరిగిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైసీపీ కార్యకర్తలను రప్పా రప్పా అని అనొద్దు అని చెప్పానన్నారు. అలా అనటం సంస్కారం కాదు అని చెప్పాను.. మన ఆస్తులను ధ్వంసం చేసి నిలువ నీడ లేని వారికి అట్టు పెడితే అట్టున్నర పెట్టాలని అన్నాను..
కూటమి నాయకులు మట్టి, గ్రావెల్ మీద దోచుకుని లోకల్ జీఎస్టీ వేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందు మీద అధనంగా జీఎస్టీ ఏంటి? అని ప్రశ్నించారు. ప్రతి మద్యం బాటిల్ మీద రూ.10 అదనంగా తీసుకోవడం వాస్తవం కాదా? అని నిలదీశారు. ఎమ్మెల్యే ప్రమేయం లేకపోతే అధనపు వసూళ్లు ఆపాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు 143 వాగ్దానాలతో పాటు ఈవీఎంలను లోబర్చుకుని చంద్రబాబు గెలిచారని, గెలిచి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ ఆరోపించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం రోజు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు పైకి వచ్చారని చెప్పారు. ప్రతి కార్యక్రమంలో జగన్‌ని నిందిస్తున్నారని.. అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని.. దిగజారుడు మాటలు మాట్లాడటానికి సిగ్గు అనిపించడం…