Vidadala Rajini: రాష్ట్రానికి ఒక్కో మెడికల్ కాలేజీని తీసుకు రావటానికి ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదు అని వైసీపీ నేత, మాజీమంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఉంటే ప్రజలకు మంచి వైద్యం అందుతుందని జగన్ ఆలోచించారు.. వైద్యం, టెస్టులు అన్నీ ఫ్రీగా అందించాలన్నది మా జగన్ ఆలోచన.. కానీ, చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సంకల్పాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు.. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేశారు.. కోట్లు ఖర్చు చేసి ఆ కుటుంబాలు వైద్య విద్య చదవగలరా? అని విడదల రజిని క్వశ్చన్ చేసింది.
Read Also: Brazilian Billionaire: ఇది మామూలు ప్రేమ కాదు.. రూ.10 వేల కోట్లకు అధిపతిని చేశాడు..!
ఇక, మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమిని కూడా ప్రైవేట్ పరం అవుతోంది అని మాజీమంత్రి రజిని ఆరోపించింది. దీని వెనుక పెద్ద స్కాం ఉంది.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.. మేము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తామని తేల్చి చెప్పింది. ఈ కుంభకోణం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తామన్నారు. అలాగే, ఆరోగ్యశ్రీని దివంగత వైఎస్ఆర్ తీసుకు వచ్చారు.. కొన్ని లక్షల మందికి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు అందించారు.. అలాంటి సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీ ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ. 4 వేల కోట్లకు పైగా బకాయిలు పడ్డారు.. ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ఆడుకుంటున్నాను.. ఆరోగ్య శ్రీని కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెట్టడం వెనుక స్కాం ఉంది.. వైఎస్సార్, జగన్ పేర్లను ప్రజల్లో లేకుండా చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని విడదల రజిని పేర్కొనింది.