టీడీపీవి డర్టీ పాలిటిక్స్.. దాడుల ఫొటోలు చూపిస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ ఆఫీసుపై దాడులు ఎందుకు జరిగాయో, రాష్ట్రపతికి చంద్రబాబు వివరిస్తే మంచిదని సూచించిన ఆయన.. కుట్రలో భాగంగానే రాష్ట్రంపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి దిగారని.. ప్రజాభిమానం ఉన్న సీఎంపై దుర్భాషలాడి ప్రజలు రెచ్చిపోయేలా చేసి, రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్నది టీడీపీ ప్రయత్నం అని ఆరోపించారు. 2019 నుంచి వరుసగా పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్,…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. అసలు ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో కూడా అర్థం కావడం లేదని ఆరోపించారు. బూతులు తిట్టినందుకు ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాడా లేదా వాళ్ల ఆఫీసు పగల గొట్టారని చెప్పేందుకు వెళ్తున్నాడో స్పష్టత కరువైందన్నారు. అసలు ఢిల్లీ పర్యటనలో ఆయన్ను పలకరించేవారే లేరని ఎద్దేవా చేశారు. తిరుపతిలో అమిత్ షాపై రాళ్లు వేయించిన చంద్రబాబు ఇప్పుడు…
ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం భౌతిక దాడుల వరకు వెళ్లింది. దీంతో అధికార పార్టీపై ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. ఈ అంశంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏపీకి కేంద్ర బలగాలు పంపాలని చంద్రబాబు హోంశాఖ అధికారులకు లేఖ రాశారు. మరోవైపు వైసీపీ దాడులకు నిరసనగా…