స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలిరోజు సీఐడీ విచారణ ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులోనే అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం ఆయన్ను ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారించింది. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో ఈ విచారణ కొనసాగింది.