స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మరోసారి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబుకు మరో 14 రోజులు రిమాండ్ ను ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు చంద్రబాబుకు ఏసీబీ జడ్జ్ చెప్పారు.
ఈ కేసును మంగళవారం రోజున సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇక తాజాగా చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను విచారించే బెంచ్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ బెంచ్ లో జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలు ఉన్నట్లు తెలుస్తుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ నెల 18లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది.
ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు అత్యవసర ఊరట దక్కలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నేడు విధుల బహిష్కరణకు బెజవాడ బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. నందిగామలో న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసనగా విధుల బహిష్కరణకు నందిగామ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై బుధవారం ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు లాయర్లు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.