కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం తన రాజీనామాను ప్రకటించారు. అప్పటి నుంచి ఖలిస్థానీలకు కంచుకోటగా మారిన కెనడా తదుపరి ప్రధానిపై చర్చలు జోరందుకున్నాయి. చాలా మంది అభ్యర్థుల పేర్లు బయటకు వస్తున్నాయి. వీటిలో ఇద్దరు భారతీయుల పేర్లు కూడా ఉన్నాయి. కెనడా యొక్క ఈ అత్యున్నత పదవికి చంద్ర ఆర్య, అనితా ఆనంద్ పోటీ పడుతున్నారు.
Chandra Arya: నిజ్జర్ల ఊచకోత విషయంలో భారత్, కెనడాల మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఈ గందరగోళం మధ్య, కెనడాలో నివసిస్తున్న హిందువుల భద్రతపై భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య పెద్ద ప్రకటన చేశారు. ఖలిస్తానీ తీవ్రవాదం నుంచి పొంచి ఉన్న ముప్పుపై దృష్టి సారించాలని ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఇటీవలి పరిణామాలకు సంబంధించి కెనడాలో నివసిస్తున్న హిందువులందరి ఆందోళనలను హిందూ…
Chandra Arya: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా, కెనడా దేశాల మధ్య వివాదాన్ని రాజేసింది. ఈ హత్య నేపథ్యంలో మరో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కెనడాలోని హిందువులను టార్గెట్ చేస్తూ, కెనడా వదిలిపెట్టి భారత్ వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చాడు. ఈ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి హిందువుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై కెనడాలో జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీలో ఎంపీగా ఉన్న చంద్ర ఆర్య తన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఖలిస్తానీ…
Canada: ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా వేదికగా మారుతోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా దేశాన్ని వినియోగించుకుంటున్నారు ఖలిస్తానీలు. ఇప్పటికే కెనడాలోని పలు భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. భారత్ నుంచి పంజాబ్ ను విభజించి సపరేట్ ఖలిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో భారతదేశానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు