నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘కార్తికేయ -2’. శ్రీ కృష్ణుడు రాజ్యమేలిన ద్వారక నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమా. సముద్రగర్భంలో మునిగిపోయిన ద్వారక పట్టణ చరిత్రను ఈ చిత్రంలో దర్శకుడు చందు మొండేటి సృజించాడు. గతంలోనూ కోడి రామకృష్ణ ఇదే తరహా కథాంశంతో ‘దేవిపుత్రుడు’ మూవీ తీశాడు. శ్రీకృష్ణుడి నిర్యాణానంతరం ద్వారక సముద్రంలో మునిగిపోయిందనేది వాస్తమనే విషయం ఆర్కియాలజీ సంస్థ వారు ప్రకటించారు. తాజాగా…
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా ‘కార్తికేయ -2’. గతంలో నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తికేయ’ను డైరెక్ట్ చేసిన చందు మొండేటి దీన్ని తెరకెక్కించాడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. కాలభైరవ స్వరాలు సమకూర్చిన ఈ మూవీలోని ‘అడిగా నన్ను నేను అడిగా… నాకెవ్వరు నువ్వని’ అనే గీతాన్ని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఉత్తర భారతానికి సంబంధించిన అందమైన లొకేషన్స్ ను ఈ పాటలో కార్తిక్ ఘట్టమనేని…
ప్రస్తుతం టాలీవుడ్‌లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘కార్తికేయ 2’ ఒకటి. నిఖిల్ సిద్ధార్థ్, చందూ మొండేటి కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రం.. బ్లాక్‌బస్టర్ ‘కార్తికేయ’కి సీక్వెల్. చాలాకాలం నుంచి నిర్మాణ దశలోనే ఉన్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఉరుములు, మెరుపులతో ప్రారంభమయ్యే ఈ మోషన్ పోస్టర్‌లో ఓ రహస్యాన్ని చేధించేందుకు సముద్రంలో ప్రయాణిస్తోన్న నిఖిల్, అనుపమ, శ్రీనివాస రెడ్డిని గమనించవచ్చు. ఇన్నాళ్ళూ ఇది…
మలయాళ సినీ పరిశ్రమనే కాకుండా మొత్తం దక్షిణాదినే షేక్ చేసిన చిత్రం ‘ప్రేమమ్’.. తెలుగులో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించగా.. శ్రుతీహాసన్, అనుపమ, మడోన్నా సెబాస్టైన్ హీరోయిన్లుగా నటించారు. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర వంశీ నిర్మించారు. కాగా, ప్రేమమ్ చిత్రం వచ్చి నేటికీ ఐదేళ్లు అవుతోంది. ఓ యువకుని జీవితంలో జరిగే మూడు అందమైన ప్రేమకథలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. మూడు పాత్రల్లోనూ నాగచైతన్య…