ఏపీలో ఛలో కంతేరు నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ కార్యకర్త వెంకాయమ్మ కుటుంబంపై దాడి ఘటనను టీడీపీ సీరియస్ గా తీసుకుంది. దాడిపై పోలీసులుస్పందించలేదంటూ ఛలో కంతేరుకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఎలర్ట్ అయ్యారు. గుంటూరు జిల్లాలో టీడీపీ కీలక నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, మాజీమంత్రి నక్కా ఆనందబాబులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు మాజీ…
ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో వెంకాయమ్మ కుటుంబంపై వైసీపీ నేతలు పలు మార్లు దాడి చేశారని ఆరోపిస్తూ టీడీపీ నిరసనలు చేపట్టింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. వెంకాయమ్మ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక కుటుంబంపై పదేపదే దాడులు జరుగుతుంటే అడ్డుకోలేకపోవడం పోలీసుల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. బాధితురాలు వెంకాయమ్మతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు…