నిండైన విగ్రహంతో విలన్ గా జడిపించి, కమెడియన్ గా కితకితలు పెట్టి, కొన్నిసార్లు సెంటిమెంట్ నూ పండించి జనాన్ని ఆకట్టుకున్నారు చలపతిరావు. అనేక ప్రేమకథా చిత్రాల్లో అమ్మాయికో, అబ్బాయికో తండ్రిగా నటించి అలరించారాయన. చిత్రసీమలో ఎంతోమంది ‘బాబాయ్’ అంటూ చలపతిరావు ను అభిమానంగా పిలుస్తూ ఉంటారు. ఇక నటరత్న యన్టీఆర్ తనయులు నిజంగానే ‘బాబాయ్’లా చూసుకుంటూ ఉంటారు. ఆయన తనయుడు రవిబాబు సైతం తండ్రి బాటలో పయనిస్తూ నటునిగా మారినా, తరువాత మెగాఫోన్ పట్టి డైరెక్టర్ గానూ…
(మే 8న చలపతిరావు పుట్టినరోజు)నటుడు చలపతిరావు పేరు వినగానే, ముందుగా ఆయన నటించిన కేరెక్టర్ రోల్స్ పలకరిస్తాయి. తరువాత మహానటుడు యన్టీఆర్ మనిషి చలపతిరావు అన్న మాటలూ గుర్తుకు వస్తాయి. ఎందుకంటే, చిత్రసీమలో ఎంతోమంది యన్టీఆర్ ను నమ్ముకొని, అక్కడే రాణించారు. అలాంటి వారిలో చలపతిరావు ప్రముఖులు. అంతకు ముందు బిట్ రోల్స్ లో తెరపై కనిపించిన చలపతిరావు, యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘కథానాయకుడు’ (1969)లో కాసింత గుర్తింపు ఉన్న పాత్ర పోషించారు. అందులో యన్టీఆర్, నాగభూషణం…