‘సొంతవూరు, గంగపుత్రులు’ వంటి అవార్డ్ విన్నింగ్ మూవీస్ ను తెరకెక్కించి సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పి. సునీల్ కుమార్ రెడ్డి తాజాగా ‘మా నాన్న నక్సలైట్’ అనే సినిమాను రూపొందించారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై చదలవాడ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తొంభైవ దశకంలోని సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ కథలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన రఘు కుంచె… కొండరుద్ర సీతారామయ్య…