Chabahar Port: భారత్‌కు అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై ఇటీవల అమెరికా ఆంక్షలు విధించింది. అయితే, ఇప్పుడు అమెరికా విధించిన ఆంక్షల నుంచి భారతదేశానికి 6 నెలల మినహాయింపు ఇచ్చినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ మినహాయింపులు సెప్టెంబర్ 29 నుంచి అమలులోకి వచ్చినట్లు మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
Pakistan: అమెరికాకు చాలా సన్నిహితంగా మారుతున్న పాకిస్తాన్, కొత్త పథకానికి తెరతీసింది. అమెరికాతో కలిసి అరేబియా సముద్రంలో ఓడరేవును నిర్మించాలని భావిస్తోంది. పాకిస్తాన్ ఈ ప్రతిపాదనను యూఎస్ ముందు ఉంచింది. బలూచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో పస్ని పట్టణంలో ఈ సివిల్ పోర్టు ఉంటుంది. ఇది ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టుకు దగ్గరగా ఉంటుంది.
US-India: ఇరాన్ వ్యూహాత్మక ఓడరేపు విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఓడరేవులో కార్యకలాపాల కోసం 2018లో మంజూరు చేసిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఓడరేవును భారత్ అభివృద్ధి చేస్తోంది. కీలకమైన టెర్మినల్స్‌ని డెవలప్ చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు అమెరికా నిర్ణయం ఇండియాను ఇబ్బంది పెట్టేదిగా ఉంది.
Jaishankar: ప్రాంతీయ రాజకీయాల్లో సరికొత్త మలుపు తిసుకున్న ఘటన తాజాగా చోటు చేసుకుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ తొలిసారిగా ఆఫ్గానిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వ కార్యకలాప విదేశాంగ మంత్రి మౌలవి అమీర్ ఖాన్ ముత్తాకీతో ఫోన్ ద్వారా అధికారికంగా మాట్లాడారు. ఇది భారత్ తరఫున తాలిబాన్ ప్రభుత్వంతో మంత్రివర్గ స్థాయిలో జరిగిన తొలిసారిగా జరిగిన సమావేశంగా చరిత్రలో స్థానం సంపాదించింది. Read Also: IPL 2025: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఆరుగురు మ్యాచ్ విన్నర్స్…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ లు ఆక్రమించుకున్నాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాలిబన్ ప్రభుత్వంను అధికారికంగా ఏ దేశాలు గుర్తించలేదు. తాలిబన్‌లకు మిత్రులుగా ఉన్న పాక్, చైనాలు కూడా అధికారికంగా గుర్తించలేదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో 22 శాతం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుండగా, మరో 36 శాతం మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. తాలిబన్ లు అధికారంలోకి వస్తే పాక్ ప్రాభల్యం పెరుగుతుందని, ఇది పోరుగునున్న భారత్‌కు ఇబ్బందికరమని, ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులకు,…