ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్- ఆప్ ప్రభుత్వం మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. రెండ్రోజుల క్రితమే ముఖ్యమంత్రి అతిషి.. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన అధికారిక బంగ్లాలోకి షిప్ట్ అయ్యారు. అయితే తాజాగా బంగ్లా నుంచి అతిషికి సంబంధించిన వస్తువులను బలవంతంగా తొలగించి సీలు చేశారు.