మే నెలలో దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్ ప్రాంతాలలో సుమారు 8-11 రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మోహపాత్ర విలేకరుల సమావేశంలో తెలిపారు. రాజస్థాన్లోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, అంతర్గత ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలలో 5-7 రోజుల పాటు వేడిగాలులు వీచే…
ఎండలు దంచికొడుతున్నాయి.. ఏళ్ల క్రితం నమోదైన రికార్డులను భానుడి భగభగలు బ్రేక్ చేస్తున్నాయి.. ఏప్రిల్ నెలే.. మే, జూన్ మాసాలుగా మారిపోయి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది ఐఎండీ.. ఇక, 122 ఏళ్లలో నార్త్ ఇండియాతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి లేదు.. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర, వాయవ్య, మధ్య భారతంలో రికార్డ్‌స్థాయిలో…