ఈ నెల ప్రారంభంలో లోక్‌సభ సమావేశాల సమయంలో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా అక్కడి నుంచి దూకి ఎంపీల మధ్యకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సందర్భంగా.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ 'లోతైన, చీకటి గది'గా మారిందని, భద్రతా ఉల్లంఘనపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపించారు.