కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్‌కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. పెన్షనర్ల ఖాతాలకు సకాలంలో పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అన్ని బ్యాంకులు ప్రతినెలా చివరి తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను జమ చేయాలని సూచించారు.