తెలంగాణలో ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రంపై టీఆర్ఎస్ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రుల సమావేశం ముగిసింది. అరగంటపాటు సాగింది ఈ సమావేశం. పంజాబ్ నుంచి ఏ తరహాలో అయితే బియ్యాన్ని కేంద్రం సేకరిస్తుందో, తెలంగాణ నుంచి కూడా అదే తరహాలో బియ్యాన్ని సేకరిస్తుంది. ఏ రాష్ట్రం పట్ల కేంద్రం ఎలాంటి వివక్షతతో వ్యవహరించదన్నారు కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.…