ఓలా, ఉబర్, ర్యాపిడో ట్యాక్సీలు అందుబాటులోకి రావడంతో ప్రయాణం ఈజీ అయ్యింది. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఉన్నచోటుకే నిమిషాల్లోనే వెహికల్ వచ్చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది. ఆఫీస్ లకు వెళ్లే వారు, అర్జెంటుగా బయటికి వెళ్లాలనుకునే వారు కార్, బైక్ ట్యాక్సీలను బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే ఇటీవల ఓలా, ఉబర్ యూజర్ల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫోన్ రకాన్ని బట్టి, ఛార్జింగ్ పర్సంటేజ్ ను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు ఆందోళన…