Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ ఉగ్రదాడి అత్యంత క్షమించరాని క్రూరమైన చర్య అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వివరించారు. బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కుతోంది. ఇలాంటి దారుణాలు జరగకూడదు. చనిపోయిన వారి ఆత్మకు…