గత యేడాది మాదిరిగానే పలువురు సినీ ప్రముఖులు ఈ సంవత్సరం కూడా కరోనా కారణంగా కన్నుమూశారు. అదే సమయంలో అనారోగ్యం కారణంగానూ మరికొందరు దివికేగారు. ప్రముఖ సినీ మాటల, పాటల రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ (64) జనవరి 5వ తేదీ గుండెపోటుతో చెన్నయ్ లో కన్నుమూశారు. 1986లో ‘శ్రీరామచంద్రుడు’తో గీత రచయితగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన వెన్నెల కంటి మూడు వందలకు పైగా చిత్రాలలో దాదాపు మూడు వేల పాటలు రాశారు. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దొరస్వామిరాజు…