Jammu Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం జరిగింది. ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్‌లోని 50కి పైగా స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు.
శనివారం కాంగ్రెస్ సీఈసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపై కాంగ్రెస్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.
రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నిన్న రాహుల్ న్యాయ్ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. అటు నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ, సీఈసీ మీటింగ్ లో పాల్గొననున్నారు.
BJP Candidate List for Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రచారాలు కూడా మొదలెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో త్వరలోనే అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోడీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం సమావేశం అయింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము…