నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌తో గతంలోనూ ఎన్నో సార్లు కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నారు.. కానీ, అవి ఎంతో కాలం పని చేయలేదు.. కొద్ది రోజులకే పాక్ మళ్లీ కాల్పులకు దిగిందని పేర్కొంటున్నారు.
Pak Cyber Attack: పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికల ద్వారా భారత్‌పై సైబర్ దాడికి ప్రయత్నిస్తోందని ఇంటలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం, ఈ-మెయిల్‌ల ద్వారా ‘డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ’ అనే ప్రమాదకరమైన వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు ట్రై చేస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది.
భారత్ తో యుద్ధంలో తాము విజయం సాధించామని తెలిపారు. మా దేశాన్ని, మా పౌరులను రక్షించుకోవడానికి తాము ఏం చేసేందుకు అయినా వెనుదిరిగేది లేదన్నారు. పాకిస్తాన్ ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు.
మత సంఘాలతో కలిసి ఇంటర్ ఫెయిత్ సమావేశం జరుగుతున్న సమయంలోనే భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం జరగడం శుభపరిణామం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారత్ దేశానికి మరో దేశం మీద యుద్ధం చేయాలని ఉండదన్నారు. దేశం మొత్తం మతాలకు, కులాలకు అతీతంగా పాక్ దాడులను ఖండించాలన్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటం ఆగదు అని సీఎం అన్నారు. భారత్‌ను విడకొట్టాలని చాలా శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని, అందరం ఐక్యంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
భారత్, పాకిస్థాన్ మధ్య పూర్తిస్థాయి తక్షణ కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఇరు దేశాలు శనివారం రోజు పరస్పరం చర్చించుకొని దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ చర్చల కోసం ఈరోజు మధ్యాహ్నం 3.35 గంటలకు పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) నుంచి భారత డీజీఎంఓకు ఫోన్ కాల్ వచ్చింది. కాల్పుల విరమణ అంశంపై ఇద్దరూ చర్చించుకున్నారు. కాగా.. ఇప్పుడు అందరూ సింధు నదీ జలాల అంశంపై క్లారిటీ వచ్చింది.
భారతదేశం పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. ఇరు దేశాల DGMO (డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్)ల మధ్య చర్చల తర్వాత ఇది సాధ్యమైంది. అసలు భారతీయ డీజీఎమ్ ఎవరు? అతని పని ఏంటో తెలుసుకుందాం.. డీజీఎమ్‌ఓ అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. ఇది సైన్యంలో ఒక ముఖ్యమైన, బాధ్యతాయుతమైన పదవి. ప్రస్తుత భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. అన్ని సైనిక కార్యకలాపాల బాధ్యత డీజీఎమ్‌ఓదే. ఏదైనా సైనిక చర్య, మార్గనిర్దేశం చేయడం,…
పహల్గామ్ ఉగ్రదాడి భారత్‌ను భగ్గుమనేలా చేసింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా భారత్ పాక్ మధ్య యుద్ధంలాంటి పరిస్థితి దాపురించింది. తాజాగా ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. ఈ సమాచారాన్ని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అందించారు. కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇంతలో పలువురు రాజకీయ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ అంశంపై మాట్లాడారు.
భారతదేశం ప్రతీకార చర్యతో పాకిస్థాన్ పూర్తిగా భయపడింది. మధ్యవర్తిత్వం కోసం అమెరికాను ఆశ్రయించింది. అమెరికా భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించింది. పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. "కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి.. భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాం.. రాత్రంతా భారత్-పాకిస్థాన్‌లతో చర్చలు జరిగాయి.. రెండు దేశాలకు నా అభినందనలు.. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి." అని ట్రంప్ పేర్కొన్నారు.
భారత్, పాకిస్థాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ పోస్ట్ చేసిన కాసేపటికే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ భారత్ విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని చెప్పారు. Also Read: IPL…
పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ తర్వాత దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి కాగానే డ్రోన్లు, క్షిపణులతో భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా పాకిస్థాన్ జరుపుతున్న దాడులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మరోవైపు.. సరిహద్దుల్లో కాల్పులకు కూడా గట్టిగా బదులిస్తోంది. అదే సమయంలో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత దళాలు భీకరదాడులకు దిగాయి. రెండు దేశాల…