ఆర్జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ అత్యాచారం-హత్య కేసులో సంజయ్ రాయ్‌కు ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా కలకత్తా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. సంజయ్‌రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లలో కోరాయి.
సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఈకేసులో ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన వ్యాపారవేత్త, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సన్నిహితుడైన దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిపోయాడు.. దీంతో, మనీష్ సిసోడియా చిక్కుల్లో పడినట్టు అయ్యింది.. దినేష్ అరోరా బ్యాంకు ఖాతాకు విజయ్ నాయర్ డబ్బులు పంపినట్టుగా అభియోగాలున్నాయి.. దీంతో దినేష్ అరోరాను సాక్షిగా పరిగణించాలని కోరుతూ సీబీఐ అధికారులు కోర్టులో పిటీషన్ వేశారు.. దినేష్ అప్రూవర్‌గా మారారని..…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులకు నార్కో ఎనాలసిస్ టెస్ట్‌లు నిర్వహించాలని.. అందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ.. అయితే, నిందితుల తరపున న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించాడు.. ఇరు పక్షాల వాదనలు విన్న విజయవాడ కోర్టు..…