అసలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితులు. అలాగని అన్నీ వదులుకుని రావడం సుతరామూ ఇష్టం వుండదు కొందరికి. వరద ప్రాంతాలైనా.. వార్ ప్రాంతాల్లోని వారికైనా ఇది సహజం. యుద్ధ క్షేత్రం ఉక్రెయిన్ నుండి తన పెంపుడు పిల్లితో సహా హైదరాబాద్ చేరుకున్నాడో యువకుడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన పుదూరు ప్రఖ్యాత్ ఉక్రెయిన్ లో వుంటున్నాడు. తన పిల్లికి వీసా, టికెట్ తీసుకుని విమానంలో సొంత గడ్డకు చేరుకోవటంతో అది…