ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో కులం కుంపటి పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అది కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కమ్మ వర్సెస్ కాపుగా మారడం ఆందోళనకరమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే పార్టీ పాత నాయకులు, మారి వచ్చిన వాళ్ళు అన్న లెక్కలు కూడా ఉన్నాయట. చివరికి మేటర్ ముదిరి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసేదాకా వెళ్ళిందట.